బాహుబలి సీక్రెట్ అతనికి తెలియదా..!

బాహుబలి రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టించినా ఇంకా ఆ సినిమాలో రాజమౌళి వేసిన ప్రశ్నకు సమాధానం దొరకలేదు. అదే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. ఈ ప్రశ్నకు ఆన్సర్ అందులో కీలక రోల్స్ చేసిన వారికి కూడా తెలియదని అర్ధమైంది. అదెలా అంటే రీసెంట్ గా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె ప్రోగ్రాంలో ఇంటర్వ్యూ ఇచ్చిన నాజర్ తనకు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియదని అన్నాడు.

బాహుబలిలో వికలాగుండి పాత్ర వేసినా దానికి చాలా మంచి పేరు వచ్చిందని. సినిమాలో తన పాత్ర ఇన్ని సీన్స్ ఉండాలి అని డిమాండ్ చేయనని.. సినిమాలో ఈ పాత్ర నాజర్ మాత్రమే చేయాలి అని దర్శకుడు అనుకుంటే చాలని అన్నారు. ఎన్నో ఏళ్లగా తెలుగు తమిళ పరిశ్రమలో సినిమాలు చేస్తున్న నాజర్ తెలుగు పరిశ్రమతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు. చిరంజీవితో తనకు ఏళ్లనాటి నుండి గొప్ప అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు.