పవన్, బన్ని యుద్ధానికి ముగింపు ఆరోజే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా దువ్వాడ జగన్నాథం. పూజ హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి బన్ని క్రేజ్ ఏంటో మరోసారి చూపించింది. కెరియర్ లో బ్రాహ్మణ వేశంలో మొదటిసారి కనిపిస్తున్న బన్ని సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడట. బన్ని పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి 'చెప్పను బ్రదర్' అన్న దగ్గర నుండి ఫ్యాన్స్ మధ్య మెగా ఫైట్ జరుగుతుంది. 

డిజె టీజర్ డిస్ లైకుల్లో రికార్డ్ సాధించింది అంటే అది కచ్చితంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ పనే అని అంచనా వేస్తున్నారు. అయితే ఇలా చూస్తు ఉండిపోతే జరగాల్సిన నష్ట జరిగిపోద్దని సీన్ లోకి అల్లు అరవింద్ ఎంటర్ అవుతున్నారట. బన్ని డిజెతో ఈ ఫైట్ కు ముగింపు పలికించాలనే ఉద్దేశంతో అరవింద్ మెగా ప్లాన్ వేశాడట. సరైనోడు ప్రీ రిలీజ్ చేసిన బన్ని ఈ సినిమా ఆడియో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇక ఆడియోకి చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ ను పిలుస్తున్నారట. ఎలాగు పవర్ స్టార్ కు గబ్బర్ సింగ్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ మీద ప్రేమతో అయినా సరే పవన్ ఈ ఆడియోకి వస్తాడని అంటున్నారు. సో మొత్తానికి పవర్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ యుద్ధానికి ఈ ఆడియో ఫంక్షన్ తో ఎండ్ కార్డ్ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.