
కింగ్ నాగార్జున అనగానే సీనియర్ స్టార్ హీరో అన్న విషయం కన్నా ఎప్పుడు చలాకీగా కనిపిస్తూ ఇప్పటి స్టార్ హీరోలకు అందంలోనూ అభినయంలోనూ పోటీ ఇస్తాడని అంటుంటారు. అయితే తనయుల ప్రేమ విషయంలో వారి ఇష్టాలకే వదిలేసిన నాగ్ ఇప్పుడు వారు చేస్తున్న పనులకు తల పట్టుకోవాల్సి వచ్చింది. తన చిన్న కొడుకు అఖిల్ జివికె మనవరాలు శ్రీయా భూపాల్ తో ప్రేమాయణం సాగించడం అది కాస్త ముదిరి పెళ్లి చేసుకోవాలనుకోవడం తెలిసిందే. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేసి అఖిల్ శ్రీయాలు ఎవరి దారి వారు చూసుకోవాలని నిర్ణయించుకున్నారట.
ఈ విషయంలో నాగార్జున ఏమి చెప్పలేని పరిస్థితి అని తెలుస్తుంది. అసలు ఆమెను పెళ్లి చేసుకోవడం నాగార్జునకు కూడా ఇష్టంలేదన్నది మరో టాక్. ఏది ఏమైనా ఎంగేజ్మెంట్ దాకా వచ్చి పెళ్లి క్యాన్సిల్ అవ్వడం నాగార్జునను చాలా బాధించిందట. అందుకే ప్రస్తుతం ఓంకార్ డైరక్షన్ లో చేస్తున్న రాజు గారి గది-2 షూటింగ్ లో తన షాట్ ఏదో తను చేసుకుని తర్వాత సైలెంట్ గా ఓ పక్క కూర్చుంటున్నాడట. ఎప్పుడు సెట్ లో సందడి చేసే నాగ్ అలా మౌనంగా ఉండటం చూసి తట్టుకోలేకపోతున్నారట. మరి నాగ్ ఈ మౌనం ఎప్పుడు వీడతాడో చూడాలి. ప్రస్తుతం సినిమా షూటింగ్ లో పాల్గొంటే కాస్త రీ ఫ్రెష్ గా ఉంటుందని షూట్ లో పాల్గొంటున్నాడట నాగార్జున.