మిరా మిరా మీసం మెలితిప్పుతాడు చూడు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా కాటమరాయుడు. డాలి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ సినిమా నుండి మొదటి సాంగ్ మిరా మిరా మీసం మెలితిప్పినాడు చూడు.. సాంగ్ కొద్ది గంటల క్రితం రిలీజ్ చేశారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఎక్కిస్తుంది.  

ముఖ్యంగా సాంగ్ లిరిక్ విషయంలో పవన్ స్టామినాకు సూట్ అయ్యేలా రాయించారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మార్చ్ 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నెల 15న కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్ సరసన శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నారు.