
మెగా ఫ్యామిలీ నుండి మరో మెగా హీరో ఎంట్రీకి సిద్ధమవుతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ మంచి ఫాంలో ఉండగా ఇప్పుడు తన సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అంటున్నాడట. మెగాస్టార్ తర్వాత పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, మెగా పవర్ స్టార్ లతో పాటుగా వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, అల్లు శిరీష్ ఇలా ఆ ఫ్యామిలీలో అందరు హీరోలుగా సక్సెస్ అయ్యారు.
మెగా ఫ్యామిలీ నుండి ఎంతమందొచ్చినా మెగా ఫ్యాన్స్ అక్కున చేర్చుకుంటారు. మరి ఈ కొత్త మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తాడో చూడాలి. ఒకే ఫ్యామిలీలో నుండి ఇంతమంది హీరోలున్న రికార్డ్ బహుశా మెగా ఫ్యామిలీకే చెందింది.. ఏ పరిశ్రమలో ఉండదని చెప్పొచ్చు. ఎంట్రీ ఇవ్వడమే కాదు ఫ్యాన్స్ ను అలరిస్తూ సూపర్ సినిమాలను అందిస్తున్నారు మెగా హీరోలు.