నిఖిల్ 'కేశవ' రన్ టైం షాక్

కుర్ర హీరోల్లో నిఖిల్ తన హవా కొనసాగిస్తున్నాడు. నోట్ల రద్దు ప్రభావం ఉన్నా సరే డేర్ చేసి మరి ఎక్కడికి పోతావు చిన్నవాడా రిలీజ్ చేసి లాస్ట్ ఇయర్ హిట్ అందుకున్నాడు నిఖిల్. తన కెరియర్ లో హయ్యెస్ట్ కలక్షన్స్ వసూలు చేసిన మూవీగా ఎక్కడికి పోతావు చిన్నవాడా క్రేజ్ సంపాదించింది. ఇక ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న సినిమా కేశవ. తనకు స్వామిరారా లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సుధీర్ వర్మ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది.

పగ, ప్రతీకారం కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో క్యారక్టర్స్ చాలా కొత్తగా ఉంటాయట. అంతేకాదు సినిమా డ్యూరేషన్ కూడా 1 గంట 45 నిమిషాలట. రెగ్యులర్ స్క్రీన్ ప్లే కి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని.. అందుకే రన్ టైం తక్కువ చేయాల్సి వచ్చిందట. మరి తక్కువ రన్ టైంతో వస్తున్న నిఖిల్ ఈ సినిమాను కూడా గత సినిమాలానే సూపర్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లో నామా అభిషేక్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రీతు వర్మ, ఇషా కొప్పికర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.