
సూపర్ స్టార్ మహేష్ నమ్రత శిరోద్కర్ ల లవ్ మ్యారేజ్ గురించి తెలిసిందే.. వంశీ సినిమాతో కలిసి పనిచేసిన ఈ ఇద్దరు అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు గౌతం, సితారలతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ సినిమా డేట్స్ విషయంలో ఇంకా సినిమా బిజినెస్ ప్రమోషన్స్ అన్ని దగ్గరుండి చూసుకుంటుంది నమ్రత.
ఈమధ్య కాలంలో నమ్రత కూడా రీ ఎంట్రీ ఇస్తుందని అన్నారు. మహేష్ మురుగదాస్ సినిమాలో నమ్రత నటిస్తుందని టాక్ వచ్చింది. అయితే ప్రస్తుతం తనకు తన పని సరిపోతుందని సినిమాల్లో నటించేంత తీరిక లేదని చెప్పేసింది నమ్రత. పిల్లలను చూసుకోవడంతో పాటు మహేష్ బిజినెస్ పనులను చక్కబెడుతున్న నమ్రత ఇప్పుడప్పుడే సినిమాల్లో నటించే అవకాశం లేదని చెప్పేసింది.