లావణ్య అందుకు రెడీ..!

అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన లావణ్య త్రిపాఠి కేవలం అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా అమ్మడిలో మరో యాంగిల్ అందరు కోరుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ సోగ్గాడే చిన్ని నాయనాలో హాట్ హాట్ గా కనిపించిన లావణ్య మళ్లీ తర్వాత అలా స్కిన్ షో చేయలేదు. అయితే ఆడియెన్స్ ను బుట్టలో వేయాలంటే అలా చేయక తప్పదని గుర్తించింది కాబోలు ప్రస్తుతం చేస్తున్న శర్వానంద్ 'రాధ' సినిమాలో అందాలను ప్రదర్శిస్తుంది.

న్యూ టాలెంటెడ్ డైరక్టర్ చంద్ర మోహన్ డైరెక్ట్ చేస్తున్న 'రాధ' సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. సినిమా టీజర్ లో తళుక్కున మెరిసిన లావణ్య చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. అటు అభినయంతో పాటు అందంతో కూడా ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయాలని అమ్మడి ఆలోచన కచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు.      

లాస్ట్ ఇయర్ శ్రీరస్తు శుభమస్తుతో హిట్ అందుకున్నా లావణ్య త్రిపాఠి ఈ ఇయర్ రాధతో పాటుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మిస్టర్ తో కూడా రాబోతుంది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో ట్రెడిషనల్ లుక్స్ తో కనిపించే లావణ్య ఈ సినిమాల ఫలితాలు సూపర్ హిట్ అందుకోవాలని ఆశిద్దాం.