కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్..!

మెగా హీరోలు కొత్తగా ప్రవేశ పెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ల హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదటిసారి అదే ట్రెండ్ ఫాలో అవుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తను నటిస్తున్న సినిమా కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారట. మార్చ్ 15న కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుందట. డాలి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.

రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా మార్చ్ 24న సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సరైనోడు దగ్గర నుండి మెగా హీరోలు ఫాలో అవుతున్న ఈ ప్రీ రిలీజ్ ట్రెండ్ ధ్రువ, ఖైది నంబర్ 150తో కూడా ఫాలో అయ్యి సూపర్ హిట్ అందుకున్నారు. పంచె కట్టుతో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న పవర్ స్టార్ కాటమరాయుడుగా అదరగొడతాడని చెప్పడంలో సందేహం లేదు.

శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. మరి సినిమా ఆ అంచనాలాను అందుకుందో లేదో తెలుసుకోవాలంటే రిలీజ్ దాకా వెయిట్ చేయాల్సిందే.