
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబి డైరక్షన్ లో సినిమా చేస్తున్నా సంగతి తెలిసిందే. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. జనతా గ్యారేజ్ హిట్ తర్వాత తారక్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా స్టార్ట్ అవ్వకముందే ఈ సినిమా బిజినెస్ గురించి ఏకంగా 85 కోట్ల ఆఫర్ ఇచ్చాడట ఓ బడా నిర్మాత.
జనతా గ్యారేజ్ 81 కోట్ల కలక్షన్స్ తో ఎన్.టి.ఆర్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఇక రాబోతున్న సినిమా అంతకంటే పెద్ద హిట్ అవుతుందనే ఆలోచనతో నిర్మాత అంత భారీ మొత్తాన్ని ఆఫర్ చేశాడట. కాని కళ్యాణ్ రాం మాత్రం తన సినిమా కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతో 85 కోట్ల ఆఫర్ కాదన్నాడట.
జైలవకుశ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రాశి ఖన్నా కాజల్ తమన్నా హీరోయిన్స్ గా సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ఇంకా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వలేదు. తారక్ లేకుండానే షెడ్యూల్ నడిపిస్తున్నారు.