
మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ తో సినిమా తీయాలని ప్రతి ఒక్క స్టార్ హీరోకి ఉంటుంది. ఇప్పటికే మహేష్, పవన్, అల్లు అర్జున్ లతో సినిమాలు తీసిన త్రివిక్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఎన్నాళ్ల నుండో అనుకుంటున్నాడు. తారక్ కూడా త్రివిక్రంతో చేసేందుకు రెడీ అన్నట్టు సిగ్నల్స్ ఇచ్చాడు.
ప్రస్తుతం బాబి డైరక్షన్ లో జై లవ కుశ సినిమా చేస్తున్న జూనియర్ ఆ సినిమా తర్వాత త్రివిక్రం సినిమా చేస్తాడని అన్నారు. కాని త్రివిక్రం ప్రస్తుతం కమిట్ అయిన పవన్ కళ్యాన్ మూవీ ఇంకా సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. అసలైతే ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది అనుకున్న ఈ సినిమా మార్చ్ రెండో వారానికి పోస్ట్ పోన్ అయ్యింది.
బాబి సినిమా పూర్తయ్యో లోపు త్రివిక్రం పవన్ సినిమా పూర్తి చేయడం కష్టం. అందుకే తారక్ ఈ గ్యాప్ లో వి.వి.వినాయక్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఇక తను ఓకే అంటే సినిమా చేసేందుకు రెడీ అంటున్న తమిళ దర్శకులపై కూడా ఓ కన్నేశాడు జూనియర్. బాబి సినిమా తర్వాత తారక్ సినిమా ఏదై ఉంటుందా అని ఫ్యాన్స్ లో ఇప్పుడే ఎక్సయిట్మెంట్ మొదలైంది. మరి చూస్తుంటే త్రివిక్రం తో తారక్ మూవీ ఇప్పుడప్పుడే కుదిరేట్టు లేదని కచ్చితంగా చెప్పొచ్చు.