
టాలీవుడ్ లో హీరోయిన్స్ మాత్రమే కాదు మ్యూజిక్ డైరక్టర్స్ కొరత కూడా ఉంటుంది. అయితే దేవి శ్రీ ప్రసాద్ లేదంటే ఎస్.ఎస్. తమన్ వీరిద్దరు కాదంటే అనూప్ రూబెన్స్. ఇక చిన్న సినిమాల కోసం సినిమా సినిమాకు కొత్త వారిని ట్రై చేస్తుండటం తెలిసిందే. అయితే ఈ ట్రెండ్ కు స్వస్థి చెప్పి బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ ప్రీతంను తెలుగులోకి దించేస్తున్నారు మాస్ మహరాజ్ రవితేజ అండ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
రొటీన్ మ్యూజిక్ విని బోర్ కొట్టిన తెలుగు ఆడియెన్స్ కు తమ సినిమా ద్వాతా కొత్త రకం మ్యూజిక్ అందించాలని ఆరాటపడుతున్నారు స్టార్ హీరోలు ఈ క్రమంలో ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సుజిత్ డైరక్షన్ లో చేస్తున్న సినిమాకు శంకర్-ఎహసన్-లాయ్ ను ట్రై చేస్తుండగా.. ఇప్పుడు రవితేజ 'టచ్ చేసి చూడు', అల్లు అర్జున్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో రాబోతున్న 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'కు ప్రీతం మ్యూజిక్ డైరక్షన్ చేయనున్నాడట.
హిందిలో గిట్టుబాటు అయ్యే రెమ్యునరేషన్ ఇక్కడ ఆఫర్ చేయడంతో ప్రీతం సంతోషంగా ఈ ప్రాజెక్ట్ లకు సైన్ చేశాడు. ధూం సీరీస్ లతో పాటుగా లేటెస్ట్ సెన్సేషన్స్ దంగల్, ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలకు మ్యూజిక్ అందించి ప్రీతం తన స్పెషల్ మార్క్ ను చూపించుకున్నాడు. మరి తెలుగులో ఇతని మ్యూజిక్ ఎలా శ్రోతలను అలరిస్తుందో చూడాలి.