ఈసారి శృతి హాసన్ ను పట్టేశాడు..!

టాలీవుడ్ లో ఓ నిర్మాత తనయుడికి స్టార్ హీరోయిన్స్ పై విపరీతమైన క్రేజ్.. ఇంకా చెప్పాలంటే అతని సినిమా చేస్తున్నాడు అంటే అందులో కచ్చితంగా స్టార్ హీరోయిన్ ఉన్నట్టే లెక్క. ఇంతకీ ఎవరా నిర్మాత తనయుడు అంటే బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్. అల్లుడు శ్రీనుతో తెరంగేట్రం చేసిన ఈ యువ హీరో మొదటి సినిమాలోనే క్రేజీ బ్యూటీలు సమంత, తమన్నాలతో రొమాన్స్ చేశాడు.  

ఇక సెకండ్ మూవీగా వచ్చిన స్పీడున్నోడు మూవీలో సోనారికా బడోరియా హీరోయిన్ కాగా అందులో కూడా మిల్కీ బ్యూటీ తమన్నాతో ఐటం సాంగ్ చేయించాడు. స్టార్ హీరోయిన్ కలరింగ్ సినిమాకు ఎంత ప్లస్ అవుతుందో బాగా తెలిసిన ఈ హీరో ప్రస్తుతం చేస్తున్న బోయపాటి శ్రీను సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తో జత కడుతున్నాడు. 

అంతేనా తన తర్వాత సినిమాకు శృతి హాసన్ ను కూడా లైన్ లో పెట్టాడట. శ్రీవాస్ డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ను ఈ రేంజ్ లో వాడుకోవడం బహుశా స్టార్ హీరోల వల్ల కూడా కాలేదు. తనయుడిని హీరోగా నిలబెట్టేందుకు బెల్లంకొండ సురేష్ హీరోయిన్స్ విషయంలో రిస్క్ బాగానే తీసుకుంటున్నాడు.  మరి ఇంత  చేసినా కుర్రాడు హీరోగా నిలబడతాడా లేదా అన్నది మరో రెండు మూడు సినిమాల్లో తెలిపోతుంది.