బాలయ్య సినిమాలో నటించే లక్కీ ఛాన్స్..!

పూరి జగన్నాథ్ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇజం ఫ్లాప్ తర్వాత స్టార్స్ ఎవరు తనకు అవకాశం ఇవ్వకున్నా బాలయ్య మాత్రం అలాంటి పట్టింపులేవి లేకుండా పూరి కథ నచ్చి అవకాశం ఇచ్చాడు. మార్చ్ 9న స్టార్ట్ అవబోతున్న ఈ సినిమాలో అంతా కొత్త వారిని తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు పూరి. అందుకే దానికి కావాల్సిన కాస్టింగ్ కాల్ కు పిలుపునిచ్చాడు.


కావాల్సిన వారి ఏజ్ క్వాలిటీస్ తో కాస్టింగ్ కాల్ ఇచ్చాడు పూరి. ఇక యాక్టింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వారెవరైనా సరే తమ ఇమేజెస్ తో కూడిన బయోడేటాను ఇచ్చినా మెయిల్ కు సెండ్ చేయొచ్చు. ఏమో అదృష్టం బాగుండి బాలయ్య సినిమాలో నటించే అవకాశం మీకే రావొచ్చు. సినిమాలో హీరోయిన్స్ గా కూడా కొత్త వారినే తీసుకునే ఆలోచనలో ఉన్నాడట పూరి. భవ్య ఆర్ట్ క్రియేషన్స్ పతాకంలో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా పూరి మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాలని చూస్తున్నాడు.