
టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంతటి క్రేజ్ సంపాదించుకున్న రెజినా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తనకు కెరియర్ మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాని అన్నది. ఏడేళ్ల క్రితం ఓ తెలుగు సినిమా చేసిన తను తమిళ సినిమా కోసం ఒకతను ఫోన్ చేసి అవకాశం ఇస్తాం కాని కొన్ని అడ్జెస్ట్ మెంట్స్ ఉంటాయని ఆన్నాడట. అదేంటో అర్ధమయ్యి కానట్టుగా ఫోన్ పెట్టేసిందట రెజినా.
ఇప్పుడు స్టార్స్ గా ఉన్న రెజినా కూడా కెరియర్ మొదట్లో ఇలాంటి ఇబ్బందులు పడ్డదన్నమాట. ఇప్పటికే బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్స్ తమతో అసభ్యకరంగా ప్రవర్తించిన వారి గురించి బట్టబయలు చేస్తున్నారు. పేర్లు మెన్షన్ చేయట్లేదు కాని దాదాపు అలా అడిగిన వారందరికి కౌంటర్స్ ఇస్తున్నారు హీరోయిన్స్. ఇక ఇప్పుడు సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో కూడా ఆ ట్రెండ్ నడుస్తుంది. హీరోయిన్ విషయంలో తేడా వస్తే మాత్రం వారి అంతు చూసే పరిస్థితి కనబడుతుంది.