
ఓ సినిమా కమర్షియల్ గా హిట్ అవడం అంటే అది కచ్చితంగా ప్రేక్షకుల మనసు గెలిచినట్టే. నచ్చిన సినిమాను నచ్చినన్ని సార్లు చూసే ఆడియెన్స్ మంచి సినిమా అంటే చాలు తాము చూడడమే కాదు తమ మౌత్ టాక్ తో సినిమాను హిట్ చేసేస్తున్నారు. సినిమా చిన్నదా పెద్దదా హీరో యువ హీరోనా స్టారా ఈ సమీకరణాలేమి లెక్కేసుకోకుండా సినిమా నచ్చితే చాలు అది హిట్ అనిపించుకునేలా చేస్తున్నారు.
ఒకప్పుడు మూస కథలకు సినిమాలకు కాలం చెల్లింది. ప్రతి ప్రేక్షకుడు కొత్తదనం కోరుకుంటున్నాడు.. ప్రయోగాత్మకంగా సినిమా వస్తే దాన్ని తమ భుజాన వేసుకుని మరి సక్సెస్ చేస్తున్నారు. అయితే ఇప్పటికి ఆడియెన్స్ ను అండర్ ఎస్టిమేట్ చేస్తూ రొటీన్ సినిమాలు వస్తున్నాయి. దానికి వారు కూడా అదే విధమైన రిజల్ట్ అందిస్తున్నారు. కాన్సెప్ట్ ఏదైనా దాన్ని ఎంతవరకు దర్శకుడు తెర మీద చూపించగలిగాడు అన్న యాంగిల్ లో మార్కులేసేస్తున్నారు ప్రేక్షకులు. ప్రేక్షకులు మెచ్చే సినిమానే సూపర్ హిట్.. అది చిన్నదైనా పెద్దదైనా.. కమర్షియల్ గా కోట్లు సంపాదించడం కన్నా ప్రేక్షకుడు నచ్చిన సినిమా అందిస్తే సినిమా మీద గౌరవం కూడా పెరుగుతుంది. ఈ ప్రయత్నంలో దర్శక నిర్మాతల మీదే భాధ్యత అంతా.