
మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ రీసెంట్ గా విన్నర్ సినిమాతో వచ్చాడు. సినిమా టాక్ ఎలా ఉన్నా సరే తేజ్ ఇమేజ్ పెంచే సినిమాగా ఈ విన్నర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా ఉన్న తేజ్ వచ్చిన టాక్ తోనే సినిమాను గట్టెంక్కించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా తనకు నచ్చని జానర్ హర్రర్ సినిమా అని.. ఇక ఆ జానర్ లో సినిమా హీరోగా జేమ్స్ కెమెరూన్ డైరక్షన్ లో ఛాన్స్ వచ్చినా చేయనని అన్నాడు తేజ్.
సుప్రీం హీరోగా చేస్తున్న ప్రతి సినిమాలో తన స్పెషాలిటీ చూపిస్తున్న మెగా హీరో కథల ఎంపికలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సి ఉంది. లాస్ట్ ఇయర్ సుప్రీం తర్వాత వచ్చిన తిక్క ఫ్లాప్ అవ్వగా రీసెంట్ గా వచ్చిన విన్నర్ మూవీ అంచనాలను అందుకోలేదన్నది నిజం. ఇక విన్నర్ ఓవర్సీస్ లో అయితే మరి కష్టం అనేస్తున్నారు. సినిమాను 1.25 కోట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్లు కనీసం 2 కోట్లు వస్తేనే కాని సేఫ్ జోన్ లోకి రారట.