ఛాన్స్ మిస్ అయ్యా.. బాధలేదు..!

మలయాళం నుండి వచ్చిన హీరోయిన్స్ కు తెలుగులో గిరాకి బాగుంటుంది. ఇప్పటికే ఎంతోమంది భామలు అక్కడి నుండి వచ్చిన ఇక్కడ క్రేజ్ సంపాదించగా ఆ క్రమంలో లేటెస్ట్ గా అనుపమ పరమేశ్వరన్ కూడా సూపర్ ఫాంలో ఉంది. అమ్మడు తెలుగులో నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అవడంతో అనుపమకు సూపర్ క్రేజ్ వచ్చింది. అయితే ఈ క్రేజ్ తోనే మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ సినిమాలో ఛాన్స్ వచ్చింది అనుకున్నారు.

కాని చరణ్ పక్కన అనుపమ సూట్ అవదనే కారణం చేత ఆమెను తప్పించారట. అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్ అయినందుకు కాస్త బాధపడినా తన వయసు కేవలం 21 ఏళ్లే రానున్న రోజుల్లో తప్పకుండా రాం చరణ్ తో నటిస్తా అని అంటుంది అనుపమ. చరణ్ సినిమా నుండి తొలగించబడ్డా ఆ చిత్రయూనిట్ తో తాను మంచి రిలేషన్ కలిగి ఉన్నానని అంటుంది.

ఇక జూనియర్ ఎన్.టి.ఆర్ సినిమాలో కూడా ఛాన్స్ మిస్ అయ్యింది అన్న వార్తలకు చెక్ పెట్టింది అనుపమ. అసలు ఆ సినిమాకు సంబందించి ఎవరు తనని కలవలేదని. మరి అలాంటప్పుడు నేను ఆ అవకాశం ఎలా మిస్ అవుతానని అన్నది. ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ అయినా తప్పకుండా తన కోసం మరో మంచి అవకాశం ఎదురుచూస్తుందని చెబుతుంది అనుపమ.