అక్కడ ఖైది హృతిక్..?

మురుగదాస్ డైరక్షన్ లో వచ్చిన తమిళ సినిమా కత్తి ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అదే సినిమా తెలుగులో ఖైది నంబర్ 150గా తీసి మెగాస్టార్ కూడా సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా హిందిలోకి తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాడట మురుగదాస్. బాలీవుడ్ కత్తి తన డైరక్షన్ లోనే చేయాలని చూస్తున్నాడట. మొదట సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లతో ఈ సినిమా చేయాలనుకున్నా కుదరకపోవడంతో హృతిక్ రోషన్ ను ఫైనల్ చేశారట.

ప్రస్తుతం మహేష్ తో సినిమా చేస్తున్న మురుగదాస్ ఆ సినిమా పూర్తి కాగానే బాలీవుడ్ కత్తి రీమేక్ చేస్తాడని టాక్. ఇక మహేష్ మూవీ కూడా తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించబోయే ఈ సినిమా జూన్ 23న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. సినిమా షూటింగ్ అప్డేట్స్ ఓకే కాని టీజర్ ఫస్ట్ లుక్ మాత్రం ఇప్పటి దాకా రిలీజ్ చేయలేదు.