
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గొడవ పడ్డదట. ఇద్దరు కలిసి పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఏక్ నిరంజన్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ టైంలో తాను ప్రభాస్ తో గొడవపడి చాలా రోజులు మాట్లాడలేదని అన్నది కంగనా. ప్రసుత్తం బాలీవుడ్ లో టాప్ రేంజ్ కు వెళ్లిన కంగనా తను నటించిన లేటెస్ట్ మూవీ రంగూన్ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చింది.
తెలుగులో తను నటించిన ఏక్ నిరంజన్ సినిమా గురించి మాట్లాడుతూ ప్రభాస్ తో తనకు గొడవ అయ్యిందని.. ఇక తర్వాత బాహుబలితో ప్రభాస్ నటన అతను చేసిన ఫీట్స్ చూసి గర్వపడ్డానని. ఇప్పుడు తన సినిమాల ఫలితాలు చూసి ప్రభాస్ కూడా గర్వంగా వీలవుతాడనుకుంటున్నా అని అన్నది కంగనా. ప్రభాస్ తో గొడవ అన్నది తప్పించి ఏ సందర్భంలో గోడవైంది అన్నది చెప్పలేదు. ఇక అప్పట్లో కేవలం డబ్బు కోసమే తెలుగులో సినిమా తీశా అని పబ్లిక్ గానే చెప్పింది కంగనా రనౌత్.