
మెగా ఫ్యామిలీలో చీలిక ఎంత ప్రభావం చూపుతుందో లేటెస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం టీజర్ డిస్ లైకులను చూస్తే అర్ధమవుతుంది. వ్యూయర్ కౌంట్ లో అదరగొడుతున్న డిజె టీజర్ ఓ పక్క డిస్ లైకుల్లో కూడా రికార్డ్ సృష్టిస్తుంది. ఇది కచ్చితంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ వల్లే అని అంటున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ ఎప్పుడైతే బన్ని చెప్పను బ్రదర్ అన్నాడో అప్పటినుండి మెగా ఫ్యాన్స్ లో అల్లు అర్జున్ ను కూడా వ్యతిరేకించే వాళ్లు ఎక్కువయ్యారు.
వారే పని కట్టుకుని మరి డిజె టీజర్ ను డిస్ లైక్ చేస్తున్నారని టాక్. అసలైతే కోలీవుడ్ లో విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య ఈ రచ్చ ఉండేది.. అజిత్ నటించిన వేదలం సినిమాకు హయ్యెస్ట్ గా 75 వేల డిస్ లైకులొచ్చాయి. దీనికి విజయ్ ఫ్యాన్స్ కారణమని అందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం డిజె టీజర్ మీద కూడా తన ప్రతాపం చూపిస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మరి ఈ గొడవ ఎప్పటితో ముగుస్తుందో ఏమో కాని అల్లు అర్జున్ కు మాత్రం ఊహించని రేంజ్లో నెగటివ్ పబ్లిసిటీ ఏర్పడుతుంది.