రెజినాతో మూడేళ్ళ రిలేషన్..?

హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్ గురించి ఛాన్స్ దొరికితే చాలు రచ్చ రచ్చ చేస్తారు మీడియా వాళ్లు. ఆ క్రమంలో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సాయి ధరం తేజ్ తో రెండు సినిమాలకు పనిచేసిన రెజినాతో లింక్ పెట్టేశారు. ఇద్దరి ప్రవర్తన కూడా అదే రేంజ్లో ఉండేది. వ్యవహారం చాలా దూరం వెళ్లినట్టు ప్రచారం జరిగినా మధ్యలో ఇద్దరు తమ తమ సినిమాల బిజీ వల్ల సైలెంట్ అయ్యారు. 

ఇక రీసెంట్ గా విన్నర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరం తేజ్ ఇప్పుడు మళ్లీ రెజినా పాట పాడుతున్నాడు. ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో మీతో నటించిన ముగ్గురు క్రేజీ హీరోయిన్స్ రెజినా, రాశి ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ ఒకేసారి మిమ్మల్ని లంచ్ కు పిలిస్తే ఎవరితో వెళ్తారు అన్నది. అయితే తనకున్న చనువు వల్ల ముగ్గురిని ఒకే చోటికి రప్పిస్తానని చెప్పగా ఫైనల్ గా ఒకరి పేరు చెప్పమంటే రెజినానే అనేశాడు. రెజినాతో కలిసి మూడేళ్లు అంటే రెండు సినిమాలకు పనిచేశానని అందుకే ఆమంటే స్పెషల్ ఇంట్రెస్ట్ అని అన్నాడు.