
రాజ్ తరుణ్ తో కింగ్ నాగార్జున మరో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రాజ్ తో ఉయ్యాల జంపాల సినిమా నిర్మాణంలో భాగమైన నాగార్జున ఈసారి సొంత బ్యానర్లో రాజ్ తరుణ్ తో సినిమా తీస్తున్నారట. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేశారని టాక్. రంజని డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా రాజ్ తరుణ్ కెరియర్ లో క్రేజీ మూవీగా రాబోతుంది.
సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో త్వరలో రాబోతున్నాడు. వంశీ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఇక ఇదే క్రమంలో సంజన డైరక్షన్ లో కూడా మరో మూవీ స్టార్ట్ చేశాడు రాజ్. ఈమధ్య కాస్త వెనుకపడ్డట్టు కనిపించినా మళ్లీ తన సత్తా చాటాలని చూస్తున్నాడు ఈ కుర్ర హీరో. చేతికి వచ్చిన హిట్ సినిమాలను కాదన్న రాజ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలను హిట్ కొట్టేలా ఎఫర్ పెడుతున్నాడు.