
స్టార్ హీరోలు కేవలం ఇప్పుడు ఇమేజ్ తో సంబంధం లేని పాత్రల్లో కూడా అలరించాలని చూస్తున్నారు. పాత్రల్లో కొత్తదనం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రాహ్మణ వేశంలో దువ్వాడ జగన్నాథంగా రాబోతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ లో బన్ని లుక్ కేక పెట్టించేస్తుంది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న డిజె టీజర్ అల్లు అర్జున్ రేంజ్ తెలియచేస్తుంది.
టీజర్ లో ఇలా మీరు ముద్దులు పెట్టేస్తే సభ్య సమాజం ఏమై పోతుంది. అన్న డైలాగ్ భలే కామెడీ ఉంది.. బన్ని స్లాంగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది.. అయితే ఇదే చారి పాత్రలో అదుర్స్ సినిమాలో ఎన్.టి.ఆర్ అదరగొట్టాడు. యంగ్ టైగర్ ఏమో తన బాడీ లాగ్వేజ్ తో సహా ఆ పాత్రకు న్యాయం చేస్తే బన్ని కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా తన స్టైల్ లో ఈ బ్రాహ్మణ లుక్ లో ఇంప్రెస్ చేస్తున్నాడు.
రిలీజ్ అయిన డిజె టీజర్ మాత్రం మెగా ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా దిల్ రాజు నిర్మిస్తున్న్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.