పూరితో కన్ఫాం చేసిన బాలయ్య..!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ నందమూరి నట సిం హం బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నారు. వందవ సినిమాగా శాతకర్ణి సినిమా చేసిన బాలయ్య 101వ సినిమాకు పూరికే ఓటేశాడు. మార్చ్ 9న ముహుర్తం పెట్టుకోబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 29న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. స్టార్ హీరో సినిమా అయినా సరే అనుకున్న డేట్స్ లో తీసే సత్తా పూరికి ఉంది.

భర్య ఆర్ట్స్ పతాకంలో ఈ సినిమాను ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మహేష్ కోసం రాసుకున్న జనగణమన కథనే బాలయ్యతో సినిమా చేస్తున్నాడని అంటున్నారు. మరి దీనిలో ఎంత నిజం ఉంది అన్నది తెలియదు. టెంపర్ తర్వాత వరుస ఫ్లాపులొస్తున్నా సరే పూరికి బాలయ్య అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. 

ఇజం ఫ్లాప్ తర్వాత స్టార్ హీరోలెవరు పూరితో పని చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాంటి సయమలో శాతకర్ణితో సూపర్ హిట్ అందుకున్నా బాలయ్య పూరి మీద ఉన్న నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చాడు. మరి దీన్ని పూరి ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.