
సింహ, నా ఇష్టం, షాడో సినిమాల అసలు నిర్మాత పరుచూరి ప్రసాద్ అయినా తనయుడు కిరీటి పేరు స్క్రీన్ పై వేస్తారు. తెలుగు పరిశ్రమలో అందరికి సుపరిచితమైన పరుచూరి కిరీటి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నందుకు కేసు బుక్ చేశారట. జూబ్లీ హిల్స్ రోడ్లలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న కిరీటి గురించి పెట్రోలింగ్ సిబ్బంది గమనించి అతని గురించి కేసు నమోదు చేశారట.
ఈ కేసు పెట్టడానికి కారణం ర్యాష్ డ్రైవింగ్ కాదు మరోటి ఉందని అంటున్నారు. అదెంటి అంటే ఓ పెద్ద పొలిటిషియన్ కూతురు వెనుక పడుతున్నాడట పరుచూరి కిరీటి. అతనికి ఒకటి రెండు సార్లు చెప్పినా లాభం లేక పోవడంతో ఇలా కేసు పెట్టారని అంటున్నారు. తాను మాత్రం పోకోమాన్ గేం ఆడుతూ రోడ్ల మీద వెళ్తున్నానని అన్నాడట కిరీటి. మరి ఈ విషయంలో ఏది అసలైన కారణం తెలియదు కాని ప్రస్తుతం కిరీటి పోలీసులకు చిక్కాడని చెప్పొచ్చు.