
సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ స్పాట్ నుండి ఫోటోలైతే లీక్ అవుతున్నాయి కాని అఫిషియల్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. అయితే టార్గెట్ 150 కోట్లు కాబట్టి అంత తొందర పడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఆలోచిస్తున్నారట.
సినిమా టీజర్ లండన్ లో చేయిస్తున్నట్టు తెలిపిన చిత్రయూనిట్ అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేదు కాని ఈ సినిమా దర్శకుడు మురుగదాస్ సినిమా రిలీజ్ డేట్ మాత్రం కన్ఫాం చేశాడు. జూన్ 23న సినిమా రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు మురుగదాస్.. చాలా ఎక్సయిటింగ్ గా ఉందని కూడా ట్వీట్ చేశారు. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ సంభవామి అని ప్రచారంలో ఉంది.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారూ. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు.