గజవాహనంపై బాహుబలి..!

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి పార్ట్ 2 ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న బాహుబలి కన్ క్లూజన్ సినిమా నుండి శివరాత్రి సందర్భంగా ఏనుగును ఎక్కుతున్న అమరేంద్ర బాహుబలి పోస్టర్ రిలీజ్ చేశారు బాహుబలి టీం. చూస్తుంటేనే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్న ఈ పోస్టర్ సినిమాలో ఇంకెలా అనిపిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.  


బాహుబమిలి మొదటి పార్ట్ అంచనాలను మించి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు అదే దారిలో ఎన్నో భారీ అంచనాలతో వస్తున్న ఈ కన్ క్లూజన్ మూవీని కూడా హిస్టరీలోనే ఏ సినిమా కలెక్ట్ చేయలేనంత ప్రీ రిలీజ్ తోనే కలెక్ట్ చేసి రికార్డులను తిరగరాయాలని చూస్తున్నారు. 1000 కోట్ల కలక్షన్స్ టార్గెట్ తో వస్తున్న బాహుబలి కన్ క్లూజన్ రిలీజ్ అయిన పోస్టర్ ఆడియెన్స్ కు మంచి కిక్ ఇస్తుంది. 

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆర్కా మీడియా నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రాజమౌళి పార్ట్ 2 కోసం నిద్రాహారాలు మాని మరి అవుట్ పుట్ మీద దృష్టి పెడుతున్నారట. మరి సినిమా ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలంటే రిలీజ్ అయ్యే దాకా ఆగాల్సిందే.