ప్రముఖ నిర్మాత శేఖర్ బాబు మృతి

ప్రముఖ నిర్మాత కేసి శేఖర్ బాబు ఈరోజు ఉదయం గుండెపోటుతో  మృతి చెందారు. ఆయన ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, సెన్సార్ బోర్డులో పని చేశారు. ముఠా మేస్త్రీ, మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, సుబ్బరాజు గారి కుటుంబం, సర్దార్, ముఠా మేస్త్రీ వంటి హిట్ చిత్రాలను తీశారు. ఆయన మృతికి తెలుగు చిత్రపరిశ్రమలో అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.