డిజె టీజర్ దుమ్ముదులిపేస్తుంది..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా దువ్వాడ జగన్నాథం. శివరాత్రి కానుకగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. బన్ని మొదటిసారి డిఫరెంట్ గా బ్రాహ్మణ గెటప్ లో కనిపిస్తున్న ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచేసింది. హీరోయిన్ శృతి హాసన్ గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ అవనుందని టీజర్ చూస్తే తెలుస్తుంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ మెగా ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా చేసింది. మెగా హీరోల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బన్ని మన దగ్గరే కాదు మలయాళంలో కూడా ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. లాస్ట్ ఇయర్ సమ్మర్ లో సరైనోడుగా సంచలన విజయం అందుకున్న బన్ని ఈ డిజెతో ఆ హిట్ మేనియా కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.

టీజర్ అయితే చాలా ప్రామిసింగ్ గా ఉంది. బన్ని లుక్ పూజా హెగ్దె క్యూట్ నెస్ సినిమాకు ఎంతో హెల్ప్ అవనున్నాయి. ముఖ్యంగా టీజర్ లో దేవి ఇచ్చిన బిట్ సాంగ్ మాత్రం అదిరిపోయింది. టీజర్ తో రికార్డులను క్రియేట్ చేస్తున్న మెగా హీరోల్లో బన్ని డిజె టీజర్ కూడా ఆ వరుసలో చేరడం ఖాయం.