
నాచురల్ స్టార్ నాని స్పీడ్ చూసి ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ముక్కున వేస్లేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. రీసెంట్ గా నాని నేను లోకల్ తో వచ్చి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. నాని కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. ఓ సినిమా సక్సెస్ అయ్యింది కదా ఓ ఆర్నెళ్లు రెస్ట్ తీసుకుందాం అన్నట్టు కాకుండా వెంటనే మరోటి స్టార్ట్ చేయడం ఆ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.
నాని ప్రస్తుతం శివ నిర్వాణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సినిమా టైటిల్ గా రకరకాల పేర్లు వినపడ్డా ఫైనల్ గా 'నిన్ను కోరి' అని ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా కొద్ది గంటల క్రితం రిలీజ్ చేశారు. సినిమా మొత్తం ఫారిన్ లోనే ఉంటున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు నాని నాచురల్ గానే కొత్తగా కనిపిస్తున్నాడు. నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి కూడా నటిస్తున్నాడు.
డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందరం మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని ఈ నిన్ను కోరి సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.