
మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఓ భారీ మల్టీస్టారర్ సినిమా చేస్తారని ప్రముఖ పారిశ్రామిక వేత్త టి.సుబ్బిరామి రెడ్డి ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ను ఈ సినిమా గురించి అడిగితే అలాంటిదేమి లేదు తనకు ఆ విషయం తెలియదు అని మాట దాటవేశారు. కాని ఈ సినిమా చేసి తీరుతా అంటున్నారు సుబ్బిరామిరెడ్డి.
మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమా అనుకోగానే మెగాస్టార్ పవర్ స్టార్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుందని అనిపించింది. అందుకే పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా గురించి చెప్పామని.. అన్నయ్యతో సినిమాకు తాను ఓకే చెప్పాడని అన్నారు. ఇక మరో పక్క చిరంజీవి కూడా తమ్ముడితో నటించేందుకు సై అన్నట్టు చెప్పారు. కచ్చితంగా ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని. ప్రస్తుతం త్రివిక్రం శ్రీనివాస్ కథ సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పారు సుబ్బిరామిరెడ్డి.
ఇక ఈ ప్రాజెక్ట్ లో బడా నిర్మాత అశ్వనిదత్ కూడా భాగస్వామ్యం అవుతారని తెలుస్తుంది. ఓ పక్క చిరు పవన్ ఈ మల్టీస్టారర్ గురించి తమకేం తెలియదు అన్నట్టు చెబుతుంటే సుబ్బిరామి రెడ్డి మాత్రం మెగా మూవీ చేసి తీరుతా అంటున్నాడు. మరి ఈ సినిమాకు సంబందించి మెగా హీరోల దగ్గర నుండి అఫిషియల్ స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.