
మహేష్ మురుగదాస్ మూవీ టైటిల్ పె ఇంకా కన్ ఫ్యూజన్ వీడలేదు. కొద్దికాలంగా వినిపిస్తున్న సంభవామి యుగే యుగే అన్న టైటిల్ కన్ఫాం అన్నట్టుగా రీసెంట్ గా విన్నర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పివిపి అన్నారు. కాని సినిమా టైటిల్ అది కాదని పీ.ఆర్ టీం డిక్లేర్ చేసింది. అది కాదు సరే మహేష్ మురుగదాస్ సినిమా టైటిల్ ఏంటి అన్న కన్ ఫ్యూజన్ రోజు రోజుకి ఎక్కువవుతుంది.
'సంభవామి యుగే యుగే' టైటిల్ ఉండే చాన్స్ లేదు అంటున్నారు సిని విమర్శకులు. ఎందుకంటే ఆల్రెడీ అదే టైటిల్ తో ఓ సినిమా వచ్చిందట. క్రిష్ నిర్మాణ భాగస్వామ్యం అయిన ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరికి తెలియదు. ఒకవేళ సినిమా టైటిల్ గా సంభవామి అని పెడతారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా మహేష్ ఈ శివరాత్రికి టైటిల్ ఇంకా టీజర్ రిలీజ్ చేయకపోతే ఫ్యాన్స్ నిరాశ చెందడం ఖాయం.