బాలయ్యతో పూరి జనగణమన

పూరి డైరక్షన్ లో సినిమా అంటే ఇదవరకు స్టార్ హీరోలు ఉరుకులు పెట్టేవారు. పూరితో సినిమా అంటే డేట్స్ ఖాళీ చేసుకుని మరి అవకాశం ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పూరి స్టైల్ ఆఫ్ మేకింగ్ అలానే ఉన్నా కథల్లో ఎలాంటి కొత్తదనం లేకపోవడం వల్ల సినిమాలు వరుస ఫ్లాపులవుతున్నాయి. ఈ టైంలో పూరి జనగణమన అని ఓ పవర్ ఫుల్ కథ రాసుకున్నాడట.  

ఈ కథ మహేష్ కు వినిపించగా ప్రిన్స్ ఓకే చెప్పాడని కాకపోతే కాస్త టైం కావాలని అన్నాడట. అప్పటిదాకా వెయిట్ చేయలేని పూరి విక్టరీ వెంకటేష్ తో ఈ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడు. తీరా చూస్తే ఈ ప్రాజెక్ట్ అక్కడ ఫైనల్ అవ్వలేదు. ఇక ఇదే కథను రీసెంట్ గా బాలకృష్ణకు వినిపించాడట పూరి జగన్నాథ్. పూరి చెప్పిన కథకు ఫిదా అయిన బాలయ్య సినిమా చేస్తున్నాం అనేశాడట. 

పూరి స్టైల్ ఆఫ్ మేకింగ్ లో బాలయ్య సినిమా అంటే ఇది కచ్చితంగా రేర్ కాంబినేషన్ అని చెప్పాలి. ప్రస్తుతం బాలయ్య తన 101వ సినిమాగా కె.ఎస్ రవికుమార్ తో ఓ ఫ్యాక్షన్ సినిమా చేస్తున్నాడని వార్తలొచ్చాయి. అఫిషియల్ గా మాత్రం బాలయ్య 101వ సినిమా ఏదన్నది తెలియలేదు.