అఖిల్ పెళ్లి పెటాకులవుతుందా..?

అక్కినేని వారసుడు అఖిల్ జివికె మనవరాలు శ్రీయా భూపాల్ తో జరిగిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఇటలీలోని రోమ్ నగరంలో వీరి పెళ్లి జరుగుతుంది అని అనుకుంటుండగా సడెన్ గా వీరి పెళ్లి పెటాకులవుతుందనే న్యూస్ ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఇప్పటికే రోమ్ కు విమాన టికెట్లను తీసుకున్న సన్నిహితులకు అవి క్యాన్సిల్ చేసుకోవాల్సిందిగా అక్కినేని, జివికె ఫ్యామిలీస్ చెప్పేస్తున్నాయట.  

ఎక్కడ చెడిందో ఏమో కాని అఖిల్, శ్రీయా ల మధ్య మనస్పర్ధలు వచ్చాయట. అటు అక్కినేని ఇటు జివికె ఫ్యామిలీలు ఎంత చెప్పినా వీరు మాత్రం వినట్లేదట. చిన్ననాటి నుండి స్నేహితులుగా ఉన్న వీరు డిసెంబర్ లో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఈ సమ్మర్ లో మ్యారేజ్ చేసుకోవడమే లేట్ అనుకోగా సడెన్ గా అఖిల్ శ్రీయాల మ్యారేజ్ క్యాన్సిల్ అని న్యూస్ చెక్కర్లు కొడుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ న్యూస్ పై ఇరు కుటుంబాల నుండి ఎలాంటి అఫిషియల్ స్టేట్మెంట్ రాలేదు. ఈ వార్త నిజమే అయితే ఇద్దరి కుటుంబాలకు కాస్త షాక్ తలిగినట్టే అవుతుంది.