పూరి మళ్ళీ అదే స్టైల్..!

టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన పూరి జగన్నాథ్ ఈమధ్య వరుస ఫ్లాప్ సినిమాలను చేస్తున్నాడు. స్టార్ హీరోలతో సూపర్ హిట్లు కొట్టిన పూరి ఇప్పుడు కుర్ర హీరోలతో సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సినిమాల రిజల్టులు కూడా అంత ఆశాజనకంగా లేవు. ఇజం ఫ్లాప్ తో ఎన్నో అపవాదాలు ఎదుర్కున్న పూరి తాజాగా తన తర్వాత సినిమా రోగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా మీద ఇంటెన్స్ క్రియేట్ చేద్దామనుకున్న పూరి ప్రయత్నం మళ్లీ బెడిసి కొట్టింది.

తన ఇదివరకు సినిమాల్లో హీరోల్లానే రోగ్ లో ఇషాన్ ను చూపించాడు పూరి. కథలో ఏమన్నా కొత్తదనం ఉంటుందా అంటే మరో చంటి గాడి ప్రేమకథ అని ట్యాగ్ పెట్టేశాడు. సో చూస్తుంటే పూరి మళ్లీ తన పాత స్టైల్ లోనే సినిమా చుట్టేశాడని తెలుస్తుంది. మాసీగా ఉండే హీరో క్లాస్ అమ్మాయిని పడేయడం ఆ కథకే నాలుగు పాటల్తో పాటు తన మార్క్ కొన్ని డైలాగులను అందించడమే పూరి స్టైల్.

వరుస ఫ్లాపులొస్తున్నా పూరి టేకింగ్ లో మాత్రం తేడా రావట్లేదు. ఒకవేళ రోగ్ హిట్ అయితే ఓకే కాని ఇది కూడా నిరాశ పరిస్తే మాత్రం కెరియర్ పరంగా పూరి చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ విషయాలన్ని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా తీసి ఉంటాడని అంటున్నారు.