మహేష్ మూవీలో జల్లికట్టు..!

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా టైటిల్ గా సంభవామి ప్రచారంలో ఉంది. రీసెంట్ గా పివిపి కూడా ఈ విషయం కన్ఫాం చేశారు. అయితే సినిమా తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతుండటంతో తమిళ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే క్రమంలో ఉన్నాడట మహేష్. ఆ ప్రయత్నంలో రీసెంట్ గా అక్కడ సంచలనం సృష్టించిన జల్లికట్టు ఆట గురించి తెలిసిందే.

ఇప్పుడు ఈ ఆట స్పూర్తితో సినిమాలో కూడా దీని ప్రస్తావన వస్తుందట. జల్లికట్టు మీద యువత చేసిన పోరాటానికి మహేష్ కూడా ట్వీట్ చేసి తన మద్ధతు తెలిపాడు. మురుగదాస్ మహేష్ సినిమాలో జల్లికట్టు మీద సీన్స్ ఉంటాయని లేటెస్ట్ టాక్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ నెల 24న శివరాత్రి కానుకగా రిలీజ్ చేస్తున్నారు.

మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 80 కోట్ల దాకా పెడుతున్నారట.