నక్షత్రంకు బ్రేక్.. పాపం కృష్ణవంశీ

క్రియేటివ్ డైరక్టర్ కృష్ణంవంశీకి కాలం కలిసి రావట్లేదని చెప్పొచ్చు. తీస్తున్న సినిమాలేవి అంతగా సక్సెస్ అవకపోవడమే కాదు సినిమాలు అనుకున్న టైం కు పూర్తి చేయలేకపోతున్నారు. ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న సినిమా నక్షత్రం. సందీప్ కిషన్, రెజినా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మెగా మేనళ్లుడు సుప్రీం హీరో సాయి ధరం తేజ్, ప్రగ్యా జైశ్వాల్ కూడా గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. సినిమా ఎనౌన్స్ మెంట్ నుండి షూటింగ్ స్టార్ట్ అవడం అంతా సాఫీగా జరుగుతుంది అనుకున్న టైంలో నిర్మాతకు ఆర్ధిక కష్టాలు వచ్చి పడ్డాయట.

అందుకే నక్షత్రం సినిమాకు స్మాల్ బ్రేక్ ఇచ్చారట. కృష్ణవంశీ చేస్తున్న ప్రతి సినిమా ఈ మధ్య ఏదో ఒక కారణంతో ఇలా ఆగిపోతున్నాయి. తను చేసిన ప్రమోషన్స్ తో సినిమా మీద మంచి బజ్ ఏర్పడగా.. సినిమా ఆగిపోయింది అనగానే ఆడియెన్స్ లో కాస్త నిరుత్సాహం మొదలైంది. నక్షత్రం సినిమా అటు కృష్ణంవంశీతో పాటుగా సందీప్ కిషన్ కు సక్సెస్ అవ్వాల్సిన అవసరం ఉంది.

మరి ఈ టైంలో సినిమా షూటింగ్ ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆగిపోవడంతో కృష్ణంవశీని చూసి అందరు జాలి పడుతున్నారు. ఇక ఇది కాకుండా మొన్నటిదాకా బాలయ్యతో చేద్దామనుకున్న రైతు సినిమా కూడా అటకెక్కడంతో కృష్ణవంశీ మరింత డీలా పడ్డారని టాక్.