రీమిక్స్ వారి కోసమే : సాయి ధరం తేజ్

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ఎంట్రీ ఇచ్చి చేసిన ఐదారు సినిమాలతోనే సుప్రీం హీరోగా అవతరించి సూపర్ ఫాంలో ఉన్నాడు. మరో రెండు రోజుల్లో విన్నర్ సినిమాతో రాబోతున్న తేజ్ మెగాస్టార్ రీమిక్స్ పాటలపై తన స్పందన తెలియచేశాడు. తానేమి కావాలని మామయ్య పాటలని రీమిక్స్ చేయడం లేదని దర్శక నిర్మాతల కోరిక మేరకే అలా చేస్తున్నానని అన్నారు.

సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం సినిమాల్లో చిరు పాటలను రీమిక్స్ చేసిన తేజ్ ఆ సినిమాలను సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక నుండి మామయ్య పాటలను రీమిక్స్ చేయనని అంటున్నాడు సాయి ధరం తేజ్. మరి అవసరం అనుకుంటే తప్ప రీమిక్స్ చేయనని అంటున్నాడు. పాటల విషయంలో తన ఇన్వాల్వ్ మెంట్ తక్కువగా ఉంటుందని.. అందుకే సాంగ్స్ విషయంలో డైరక్టర్ మ్యూజిక్ డైరక్టర్ ఏది చెబితే అది ఫైనల్ చేస్తానని అన్నారు.