
టైటిల్ చూసి మెగా నందమూరి మల్టిస్టారర్ కు ముహుర్తం కుదిరిందా ఏంటని అనుకోవచ్చు. దానికింకా టైం ఉంది కాని ప్రస్తుతం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. కాస్త కన్ ఫ్యూజన్ గా ఉంది కదా. అసలు విషయం ఏంటి అంటే కొణిదెల ప్రొడక్షన్ అంటూ పెట్టి మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా తీసి నిర్మాతగా కూడా మెగా పవర్ చూపిన రాం చరణ్ తన నిర్మాణంలో తారక్ తో సినిమా తీస్తాడని ఫిల్మ్ నగర్ టాక్.
ప్రస్తుతం జూనియర్ ఎన్.టి.ఆర్ చేస్తున్న బాబి సినిమా పూర్తి అయ్యాక మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తాడని అంటున్నారు. ఆ సినిమాకు నిర్మాతగా చెర్రి ఉంటాడట. మెగా క్యాంప్ కు త్రివిక్రం చాలా క్లోజ్ ఆ ఉద్దేశంతోనే చరణ్ నిర్మాణంలో త్రివిక్రం తారక్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఇది ఒక రూమర్ అని వినిపిస్తున్నా ఇది కనుక నిజమైతే మెగా నిర్మాణంలో నందమూరి హీరో సినిమా సంచలనం సృష్టించినట్టే.
ఓ పక్క చెర్రి తను చేస్తున్న సుకుమార్ సినిమా గురించి ట్రైన్ అప్ అవుతూనే ఓ పక్క నిర్మాణ భాధ్యతలను చూస్తున్నాడు. ఇప్పటికే మెగాస్టార్ 151వ సినిమా కూడా చరణ్ నిర్మిస్తుండటం విశేషం.