రజినితో ఆ హీరోయిన్ కన్ఫాం..!

సూపర్ స్టార్ రజినికాంత్ నటిస్తున్న రోబో సీక్వల్ 2.0 ఓ పక్క షూటింగ్ జరుపుకుంటుండగా తన తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇప్పటికే పా.రంజిత్ డైరక్షన్ లో మరో సినిమా చేస్తున్న రజిని ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ ను కూడా ఫైనల్ చేశారని తెలుస్తుంది. పా.రంజిత్ రజినికాంత్ కాంబినేషన్ లో వచ్చిన కబాలి ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. టీజర్ లో ఇప్పటిదాకా వేల సినిమాలు దక్కించుకోలేని క్రెడిట్ కబాలి అందుకుంది.


ఇక అదే సూపర్ కాంబోలో మరో సినిమా వస్తుంది. మే నెలలో స్టార్ట్ అవుతున్న ఈ సినిమాలో విద్యా బాలన్ హీరోయిన్ గా నటిస్తుందట. రజిని అల్లుడు ధనుష్ నిర్మిస్తున్న ఈ సినిమా కబాలి సీక్వల్ అనే టాక్ వినిపిస్తుంది. చిత్రయూనిట్ మాత్రం ఈ సినిమా కబాలి స్కీవల్ కాదని క్లారిటీ ఇచ్చింది. బాలీవుడ్ హీరోయిన్స్ తో రజిని రొమాన్స్ ఇప్పుడు కొత్తేమి కాదు ఇప్పటికే లింగా సినిమాలో సోనాక్షి సిన్హాతో రొమాన్స్ చేసిన రజిని ఇప్పుడు విద్యా బాలన్ తో జతకడుతున్నాడు. మరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కబాలిని మించి కేక పెట్టించే సినిమా అవ్వాలని ఆశిద్దాం.