
నందమూరి బాలకృష్ణ వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సంచలన విజయం అందుకోగా ఆ ఉత్సాహంతో తన 101వ సినిమాను త్వరగానే స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు బాలకృష్ణ. కృష్ణవంశీ రైతు సినిమా తన 101వ సినిమా అనుకున్నా అది ఎందుకో అటకెక్కేసింది. ఇక తాజాగా కె.ఎస్.రవికుమార్ తో ఓ ఫ్యాక్షన్ నేపథ్యంతో సాగే కథతో సినిమా చేస్తున్నట్టు టాక్. అసలు ఈ ప్రాజెక్ట్ కన్ఫామే అవ్వలేదు కాని కోలీవుడ్ మీడియా మాత్రం ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా ఓకే అయ్యిందని హడావిడి చేస్తుంది.
మన హీరో గురించి అక్కడ మీడియా న్యూస్ రావడం విశేషం అని చెప్పుకోగా.. దర్శకుడు ఎలాగు అక్కడ వాడు కాబట్టి సినిమా గురించి అక్కడే ముందు ఎనౌన్స్ చేసి ఉంటాడని అంటున్నారు. మరి ఫ్యాక్షన్ కథలకు బాలయ్యను మించి హీరో లేడు.. ఆ హీరోయిజానికి బాలయ్య చూపించే పౌరుషం ఫ్యాన్స్ ను హుశారెత్తిస్తుంది. శాతకర్ణి సక్సెస్ తో జోరు పెంచిన బాలయ్య సినిమా కన్ఫాం అయితే వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. ఇక తమన్నాతో బాల్య రోమాన్స్ ఇదే మొదటిసారి. మిల్కీ మెరుపులతో ప్రేక్షకులను అలరిస్తున్న తమన్నా బాలకృష్ణ పక్కన ఎలా కనిపిస్తుందో చూడాలి.
మరి ఈ సినిమా గురించి అఫిషియల్ స్టేట్మెంట్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు బాలకృష్ణ తన 100వ సినిమాకు కథలు చెప్పిన దర్శకులను మళ్లీ పిలిపించుకుని కథలను వింటున్నాడట.