గెలుపు అంటే ఏంటో కళ్యాన్ మామే చెప్పాడు

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ అనతి కాలంలోనే మెగా అభిమానుల్లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం విన్నర్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన మామయ్య పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయం చెప్పాడు తేజు. తనకు అసలు గెలుపు ఏంటి అన్నది మామ కళ్యాన్ మామ చెప్పాడని అన్నాడు తేజ్.  

తాను అవార్డ్ గెలిచిన సంతోషంలో మామకు ఆ అవార్డ్ చూపించగా అసలైన గెలుపుకి అర్ధం ఏంటో తెలుసా ఓటమిలో ఉన్నప్పుడు నీ చుట్టూ ఎవరైనా ఉంటే అది అసలైన గెలుపని చెప్పాడట. ఆ విషయాన్నే దృష్టిలో పెట్టుకున్న తేజ్ తన అసలు గెలుపు అంటే అర్ధమైందని ఈ ప్రయాణంలో తాను తెలుసుకున్న అభిమానులే తన గెలుపని అన్నాడు. గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేసిన విన్నర్ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ నెల 24 శివరాత్రి సందర్భంగా సినిమా రిలీజ్ అవుతుంది.