వాడో ఉట్టి వెధవ ; నాగబాబు

మెగా మేనళ్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరం తేజ్ మెగా అభిమానుల్లో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. నిన్న జరిగిన విన్నర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగా బ్రదర్ నాగబాబు తేజ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టాడు. తేజ్ చాలా అమాయకుడని.. వెధవకి అబద్ధం ఆడటం కూడా రాదని మేనళ్లుడి మీద తనకున్న ప్రేమను చాటాడు. మా వాడితో సినిమాలు చేస్తున్న నిర్మాతలకు థాంక్స్.. మా మేనల్లుడు సాయిధారం తేజ్ అంటే మాకు చాలా ఇష్టం నాకు మాత్రమె కాదు చిరంజీవి, కళ్యాన్ లకు ఇష్టమే అన్నాడు నాగబాబు.  

మా టివి అవార్డ్ ఫంక్షన్ లో తన అవార్డ్ తల్లి చేతుల మీద తీసుకున్న విధానం తనకు నచ్చిందని.. జీవితంలో సాధించాల్సింది అదేనని అన్నారు. తన సోదరిని స్టేజ్ మీద పిలిచి మనసు గెలిచాడని అన్నారు నాగబాబు. తను కష్టపడుతూ మంచి సినిమాలు చేస్తున్నాడని.. విన్నర్ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు నాగబాబు.