తేజా నీ ప్లాన్ అదా బాబు..!

ప్రేమకథల దర్శకుడు తేజ ప్రస్తుతం రానా హీరోగా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా చేస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా రానా ఘాజీ సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా క్రేజ్ ను తన సినిమాకు కలిసొచ్చే ఆలోచనలో తేజ ఘాజీ సక్సెస్ జోష్ లో రానాని ఇంటర్వ్యూ చేశాడు. 

ముందు ఈ సినిమాను అయిష్టంగా చూసిన తేజ.. సినిమా చూశాక తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడట. సినిమా బాగా నచ్చిందని చెబుతున్న తేజ తెలుగు సినిమాలో ఇదో ఆణిముత్యం అన్నట్టు చెప్పుకొచ్చాడు. సడెన్ గా తేజా ఇలా ఘాజీ గురించి మాట్లాడటం మాత్రం కేవలం తన సినిమా ప్రమోషన్స్ లో భాగమే అని అంటున్నారు. ఊళ్లో రాజకీయాల గురించి ప్రస్థావించబోతున్న ఈ సినిమాలో రానా క్యారక్టర్ కొత్తగా ఉంటుందని అంటున్నారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.