
మెగా హీరోల్లో వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరక్షన్ లో దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తున్న బన్ని సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలను పెంచేశాడు. సంప్రదాయ బ్రాహ్మణుని లుక్ తో బన్ని ఇంప్రెస్ చేశాడని చెప్పొచ్చు.
అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కే మెగా ఫ్యాన్స్ అందులోనూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఫస్ట్ లుక్ కోసం ఈ రేంజ్లో హడావిడి చేయడం మిగతా మెగా హీరోలకు షాక్ ఇస్తుంది. మెగా అభిమానుల అండదండలతోనే తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న బన్ని ఇప్పుడు సెపరేట్ గా తాను కూడా ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్నాడు. మరి ఇదే క్రేజ్ తో సినిమా కూడా హిట్ కొడతాడేమో చూడాలి.