రకుల్ అక్కడ వదలట్లేదు..!

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కేవలం ఇప్పటిదాకా టాలీవుడ్ మీద తన ప్రతాపం చూపించింది. చిన్న సినిమాలతో మొదలైన ఆమె కెరియర్ ఇప్పుడు స్టార్స్ తో మొదటి ఆప్షన్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో చేతినిండా సినిమాలున్న అమ్మడికి ఇప్పుడు కోలీవుడ్ నుండి కూడా లక్కీ ఆఫర్ వచ్చింది.

విలక్షణ నటుడు సూర్య హీరోగా సెల్వ రాఘవన్ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఓకే అయ్యిందట. సినిమాలో హీరోయిన్ కోసం ఎంతోమందిని స్క్రీన్ టెస్ట్ చేయగా ఫైనల్ గా రకుల్ ఆ ఛాన్స్ దక్కించుకుంది. టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ భామ కోలీవుడ్ పై కూడా కన్నేసిందని తెలుస్తుంది. మరి ఇదే హిట్ జోష్ అక్కడ కొనసాగుతుందో లేదో చూడాలి.