
తెలుగు ప్రేక్షకులను తన మాటల తూటాలతో మంత్ర ముగ్దుల్ని చేసే త్రివిక్రం శ్రీనివాస్ అంటే ఇష్టపడని సిని ప్రేమికుడు ఉండడు. ప్రతి సినిమాలో ఏదో ఒక విషయాన్ని చెప్పే త్రివిక్రం డైరక్షన్ ప్రతిభ ఏంటో అందరికి తెలిసిందే. అయితే మన దగ్గర మాత్రమే కాదు కోలీవుడ్ క్రేజీ విలన్ కూడా త్రివిక్రం గురించి గొప్పగా చెబుతున్నాడు.
త్రివిక్రం సినిమా అయితే కథ కూడా వినకుండా ఓకే చెప్తా అంటున్నాడు తమిళ విలన్ సంపత్. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో విలన్ గా నటించిన సంపత్ ఆ సినిమా చేస్తున్న టైంలో త్రివిక్రంతో మంచి పరిచయం ఏర్పడ్డదట. సంపత్ చేసే తీరు నచ్చి నేను చెప్పినదాని కన్నా మీరు బాగా చేస్తున్నారని అన్నాడట త్రివిక్రం. అందుకే తెలుగులో త్రివిక్రం, తమిళంలో వెంకట్ ప్రభు ఈ దర్శకులతో సినిమా అంటే కథ గురించి కూడా ఆలోచించకుండా సినిమా చేస్తా అంటున్నాడు సంపత్.