
కింగ్ నాగార్జునకు ప్రస్తుతం కాలం అంతగా కలిసి రావట్లేదు. ఊపిరి తర్వాత చేసిన నిర్మలా కాన్వెంట్, ఓం నమో వెంకటేశాయ రెండు సినిమాలు నిరాశ పరచాయి. సినిమా మీద అంచనాలున్నా మంచి టాక్ వచ్చినా నమో వెంకటేశాయ తీవ్ర నిరాశకు గురి చేసింది. అయితే సినిమా పోతే హీరోలకు ఏం ఇబ్బంది అనుకుంటాం కాని తనని నమ్మి పెద్ద మొత్తంలో సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత కన్నా ముందు హీరోనే అడుగుతారు.
ఆ క్రమంలోనే నమో వెంకటేశాయ సినిమా డిస్ట్రిబ్యూటర్లు నష్ట పరిహారం గురించి డిస్కషన్స్ స్టార్ట్ చేశారట. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన నమో వెంకటేశాయ మొదటి వారాంతరం కేవలం 5 కోట్ల వసూళ్లను రాబట్టడంతో ఢీలా పడ్డారు డిస్ట్రిబ్యూటర్లు. అందుకే నాగార్జునతో చర్చలు జరిపి తమ కు న్యాయం చేయాలని అడుగుతున్నారట. ఓం నమో వెంకటేశాయ ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్ల దాకా జరిగింది. మరి ఆ డిస్ట్రిబ్యూటర్లను నాగ్ ఎలా ఆదుకుంటాడో చూడాలి.