డిజె ఫస్ట్ లుక్.. బన్ని అదరగొట్టాడు

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన స్టైలిష్ స్టార్ గా అవతరించిన అల్లు అర్జున్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. లాస్ట్ ఇయర్ సమ్మర్ లో సరైనోడుతో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన బన్ని సరిగ్గా మళ్లీ అదే సమ్మర్ టార్గెట్ తో తన తర్వాత సినిమా దువ్వాడ జగన్నాథంను రెడీ చేస్తున్నాడు. హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.  

సినిమా టైటిల్ నుండి మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రీ లుక్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఇక కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అయితే మరో హిట్ బన్ని ఎకౌంట్ లో చేరేందుకు రెడీ అన్నట్టు ఉంది. కెరియర్ లో మొదటిసారి అల్లు అర్జున్ ఓ బ్రాహ్మణుడిగా నటిస్తున్నాడు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

ఫస్ట్ లుక్ తోనే అంచనాలను పెంచేసిన ఈ సినిమా సమ్మర్ లో మరో సరైన హిట్ అందుకుంటుందని నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తుందో చూసేందుకు మెగా అభిమానులంతా ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.